హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి నోరు పారేసుకున్న కర్ణాటకకు చెందిన ఎంపీ తేజస్వి సూర్య పై చర్యలు తీసుకోవాలని, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన బీజేపీ హైకమాండ్ ను డిమాడ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రాష్ట్ర విభజనపై తేజస్వి వ్యాఖ్యలను తొలగించేందుకు నాయుడు సహాయం కోరారు. రాష్ట్ర విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం రెండు రాష్ట్రాల మధ్య ద్వేషాన్ని మాత్రమే సృష్టిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయాలని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడును వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కోరారు. నాయుడుకు రాసిన లేఖలో రాష్ట్ర విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం రెండు రాష్ట్రాల మధ్య ద్వేషాన్ని మాత్రమే సృష్టిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తేజస్వి సూర్య చెప్పినట్లుగా ఇది భారత్, పాకిస్తాన్ లాంటిదే అయితే, ఈ రెండు రాష్ట్రాలలో ఏది భారత్, ఏది పాకిస్తాన్? అని ప్రశ్నించారు. రెండు దేశాల మధ్య ఉన్నట్లుగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా సరిహద్దు వివాదం ఉందా అని నిలదీశారు. మనం రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ, తెలుగు ప్రజలందరూ అభివృద్ధి పథంలో ఐక్యత, సామరస్యం, పరస్పర సహకారంతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇది నేటి అత్యవసర అవసరం. దీని కోసం మీ పూర్తి సహకారం అవసరం. మీరు నా అభ్యర్థనను ఉదార హృదయంతో అర్థం చేసుకుని, తగిన విధంగా స్పందిస్తారని నేను ఆశిస్తున్నాననని ఆ లేఖలో పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
