Hero Teja Sajja – Mirai : మిరాయ్ చిత్రం భావోద్వేగాల స‌మ్మేళ‌నం

హీరో, ద‌ర్శ‌కుడు స‌జ్జా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

Hello Telugu - Hero Teja Sajja - Mirai

Hello Telugu - Hero Teja Sajja - Mirai

Mirai : హీరో స‌జ్జా న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిరాయ్ (Mirai) దుమ్ము రేపుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది పూర్తిగా యాక్ష‌న్, అడ్వెంచ‌ర్, ఫాంట‌సీ తో పాటు ఎమోష‌న్ ల‌తో కూడిన క్లీన్ కుటుంబ క‌థా చిత్రం అని పేర్కొన్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్ లో దీనిని తీశాడు. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల వారు దీనిని ఆద‌రిస్తున్నారు. మిరాయ్ విడుద‌లై పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుండ‌డం ప‌ట్ల స్పందించాడు. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ శక్తివంతమైన పాత్రలో నటించారు, రితికా నాయక్ మహిళా కథానాయికగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ ఖ‌ర్చుతో దీనిని నిర్మించారు. శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజే ఏకంగా రూ. 3 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

Mirai Movie Updates

హ‌నుమాన్ మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. ఆ త‌ర్వాత ప్ర‌యోగాలు చేయాల‌ని అనుకోలేద‌న్నాడు స‌జ్జా. అయితే కొత్త స‌బ్జెక్టుతో ముందుకు రావాల‌ని చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌న్నాడు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాన‌ని చెప్పాడు. చేసిన క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ద‌క్కింద‌న్నాడు స‌జ్జ . వాస్తవానికి హ‌నుమాన్ కంటే ఎక్కువ‌గా మిరాయ్ కోసం క‌ష్ట ప‌డ్డాన‌ని చెప్పాడు. సినిమా త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని, కానీ ఇంత బిగ్ హిట్ చేస్తార‌ని అనుకోలేద‌న్నాడు . ప్రేక్ష‌కుల‌కు ఏం కావాలో, ఎలా ఆలోచిస్తారో, ఏది కావాల‌ని అనుకుంటారో దానిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తామ‌న్నాడు తేజ స‌జ్జా. త‌న త‌ల్లి క‌లను నెర‌వేర్చేందుకు , ఇతిహాసాల‌లో దాగి ఉన్న స‌మాధానాల‌ను కనుగొనేందుకు చేసిన ప్ర‌యాణమే ఈ మిరాయ్ సినిమా అన్నాడు తేజ స‌జ్జా.

Also Read : Bigg Boss 9 Interesting : ఆస‌క్తిని రేపుతున్న బిగ్ బాస్ -9 షో

Exit mobile version