టెక్నాలజీ మానవాళికి సేవ చేయాలి : బిల్ గేట్స్

స్ప‌ష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీలో ప‌ర్య‌టిస్తున్నారు బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్. సోమ‌వారం ఆయ‌న‌కు ఘ‌నంగా స్వాగ‌తం ల‌భించింది. ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రులు , ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా స‌చివాల‌యంలో స‌ర్కార్ ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ సంద‌ర్శించారు బిల్ గేట్స్. ఈ సంద‌ర్బంగా దాని ప‌నితీరు గురించి సీఎం వివ‌రించారు . ఆంధ్రప్రదేశ్ అంతటా జీవితాలను మారుస్తోందని చెప్పారు. పాలనలో వేగాన్ని, రియల్ టైమ్‌లో వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తుందని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. 1990లలో బిల్ గేట్స్‌తో తాను సమావేశం అయిన‌ట్లు తెలిపారు.

ఇదే క్ర‌మంలో మ‌రోసారి బిల్ గేట్స్ మ‌రోసారి తాము భేటీ కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు ఈ సంద‌ర్భంగా. ఇది ఈ సాంకేతికతతో నడిచే పౌర సాధికారతకు ప్రేరణ ఇచ్చింద‌న్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యంలో ప్రధాన కార్యక్రమాలతో పాటు, తెలివైన యువ మనస్సులతో కూడిన ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఈరోజు ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. వాట్సప్ గవర్నెన్స్, అవేర్ 2.0, బ్లాక్ చెయిన్ ద్వారా భూ రికార్డుల భద్రత వంటి అంశాలను బిల్ గేట్స్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కుప్పంలో అమలవుతున్న ‘సంజీవని’ హెల్త్ ప్రాజెక్టును చూసి “దట్స్ నైస్” అంటూ కితాబిచ్చారు. టెక్నాలజీలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని “గ్రేట్ వర్క్” అని కొనియాడారు.

Exit mobile version