ఆసియా క‌ప్ 2026 విజేత టీమిండియా

72 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక ఫైన‌ల్ లో ఓట‌మి

hellotelugu-Teamindia

దుబాయ్ : మ‌హిళా భార‌త జ‌ట్టు స‌త్తా చాటింది మ‌రోసారి. అమ్మాయిలు స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఆసియా క‌ప్ 2026 విజేత‌గా నిలిచారు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగింది ఫైన‌ల్ మ్యాచ్ శ్రీ‌లంక జ‌ట్టుతో. శ్రీలంకపై 72 పరుగుల భారీ విజయం సాధించి చ‌రిత్ర సృష్టించింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తరపున తన 36వ టి20లో అర్ధ శతకాన్ని సాధించిన స్మృతీ మంధాన , మహిళల ఆసియా కప్‌లోనే అత్యంత వేగవంతమైన (24 బంతుల్లో) అర్ధ శతకం నమోదు చేసిన షఫాలీ అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను మ్యాచ్ నుంచి దూరం చేశారు. షఫాలీ వర్మ 39 బంతుల్లో 68 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేయగా, స్మృతి మంధాన 39 బంతుల్లో 59 పరుగులు (5 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

ఈ ఓపెనింగ్ జోడి 12.5 ఓవర్లలో 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేసింది. ఆ తర్వాత యువ క్రీడాకారిణి గుణలన్ కమలిని 5 బంతుల్లో 15 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 183కి చేరింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది; చమరి అథపత్తు (36), నిలాక్షిక సిల్వ (22) అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు. దీప్తి శర్మ (2/15), శ్రీ చరణి (4/20) వికెట్లు పడగొట్టారు. శ్రీలంక తరపున మిథాలి అయోధ్య (1/33), చమరి అథపత్తు (1/34), చముడి ప్రబోధ (1/40) వికెట్లు సాధించారు. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని భార‌త మ‌హిళా జ‌ట్టు సాధించిన క‌ప్ ల‌లో ఇది నాల్గ‌వ‌ది కావ‌డం విశేషం.

Exit mobile version