త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు భిన్నంగా ఉంటాయి

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆద‌వ్ అర్జున

hellotelugu-AdhavArjuna

చెన్నై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు త‌మిళనాడు రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉన్నాయి. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మొత్తం 234 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు ముగిశాయి. మే 4వ తేదీన రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించేందుకు ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టీవీకే పార్టీ ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున మాట్లాడారు ఎగ్జిట్ పోల్స్ పై. .ఈ ఎన్నికను ఎవరూ అంచనా వేయలేరని అన్నారు. ఇండియా టుడే యాక్సిస్ కూడా మా సంఖ్యలను, శాతాన్ని తక్కువగా అంచనా వేసిందని మండిప‌డ్డారు.

తాను త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల గురించి 2-3 నెలల క్రితమే చెప్పాను, ఈ ఎన్నికను ఎవరూ అంచనా వేయలేరని అన్నారు ఆద‌వ్ అర్జున‌. ఏ ఎన్నికల విశ్లేషకుడు అంచనా వేయలేడని పేర్కొన్నాడు. ఏ సర్వే కూడా అంచనా వేయలేదని అన్నారు. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పాడు. మహిళలు, యువత కలయిక అయిన టీవీకే, తమిళనాడు ఎన్నికల ఫలితాలను మార్చబోతోందని జోష్యం చెప్పారు. ఆ రోజు మీరు ఫలితాన్ని ఖచ్చితంగా చూడవచ్చు అని పేర్కొన్నారు. 50 ఏళ్ల తర్వాత, తమిళనాడులో ఇది ఒక చారిత్రాత్మక తీర్పు కాబోతోందని స్ప‌ష్టం చేశారు ఆద‌వ్ అర్జున‌.

Exit mobile version