Rashmika Mandanna : ముంబై : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు భిన్నమైన పాత్రలు చేయాలని ఉందన్నారు. తాను గొప్ప నటిగా భావించడం లేదన్నారు. ఇంకా నేర్చు కోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం తాను ఎంపిక చేసుకునే పాత్రలన్నీ భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నానని పేర్కొన్నారు. శనివారం రష్మిక మందన్నా మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రతి నటీ నటులకు అనుకోకుండా పాత్రలు వస్తాయని , అలాంటి వాటి కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. తాను ఇప్పటి వరకు నటించిన వాటిలో మరిచి పోలేనివి కూడా ఉన్నాయని అన్నారు రష్మిక మందన్నా.
Rashmika Mandanna Comments
తాజాగా కొత్త పాత్రలో నటిస్తున్నానని, దీనికి ఎటువంటి రిఫరెన్స్ పాయింట్ కూడా లేదన్నారు.ఈ పాత్రను పోషించడానికి దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ దృష్టిపై మాత్రమే ఆధారపడాల్సి వచ్చిందని చెప్పారు నేషనల్ క్రష్. తాను ఒక నటిగా తెలియని ప్రాంతాలలోకి తీసుకెళ్లే పాత్రల కోసం వెతుకుతున్నానని తెలిపారు. ఇప్పటి వరకు నటించిన వాటిలో డియర్ కామ్రేడ్, గీత గోవిందం, పుష్ప, యానిమల్ సినిమాలు పేరు తీసుకు వచ్చేలా చేశాయన్నారు. భావోద్వేగాలు పండించే పాత్రలు అంటే చాలా ఇష్టమన్నారు రష్మిక మందన్నా. నేను కూడా సినిమా సమీక్షలు చదువుతా. ప్రకృతిని, పరిసరాలను పరిశీలిస్తుంటా. ఇచ్చిన పాత్రకు ఎంత మేరకు న్యాయం చేయాలనే దానిపై దృష్టి సారిస్తానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
Also Read : CM Siddaramaiah Shocking Comments : కేంద్రం హిందీని రుద్దాలని చూస్తోంది : సీఎం
