T20 World Cup Important Update : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం 5 వేదిక‌లు ఖ‌రారు

ప్ర‌క‌టించిన ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ కౌన్సిల్

Hello Telugu - T20 World Cup Important Update

Hello Telugu - T20 World Cup Important Update

T20 World Cup : దుబాయ్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు శ‌నివారం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ (T20 World Cup) నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి షెడ్యూల్ ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. ఈమేర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా టోర్నీకి సంబంధించి వేదిక‌ల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా భార‌త దేశంలో 5 వేదిక‌ల‌ను ఎంపిక చేసింది. ఇప్ప‌టీకే ఐసీసీ చైర్మ‌న్ జే షా ఆధ్వ‌ర్యంలో ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వ‌హించింది. వ‌చ్చే ఏడాది 2026 లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఈ మెగా బిగ్ టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు పాల్గొంటున్నాయి. టోర్న‌మెంట్ లో భాగంగా 55 మ్యాచ్ లు ఆడ‌తాయి. రెండు గ్రూప్ లుగా విభజిస్తారు. ఇదిలా ఉండ‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).

T20 World Cup Updates

మ‌రోసారి ఐసీసీ కార్య నిర్వాహ‌క బోర్డు స‌మావేశం కానుంది. స‌మావేశం అనంత‌రం పూర్తి షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇక టోర్నీకి సంబంధించి ఇండియా లోని ఐదు వేదిక‌ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఇందులో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, ముంబై లోని వాంఖ‌డే స్టేడియం, కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ , చెన్నై లోని ఎంఏ చిదంబ‌రం స్టేడియం, అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపింది. శ్రీ‌లంక‌లో మూడు స్టేడియంలు ఉన్నాయ‌ని పేర్కొంది. త‌ట‌స్థ వేదిక ప్ర‌కారం పాకిస్తాన్ మ్యాచ్ లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది.

Also Read : ICC Womens World Cup Sensational : చ‌రిత్ర సృష్టించిన ఐసీసీ ఉమెన్ వ‌న్డే క‌ప్ ఫైన‌ల్

Exit mobile version