హైదరాబాద్ : ప్రముఖ విలక్షణ నటుడు, హోస్ట్ గా పేరు పొందిన అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ -10 ఆదరణ చూరగొంటోంది. అయితే రోజుకో ట్విస్టుతో మరింత ఉత్కంఠను రేపుతోంది. తాజాగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై చర్చ కొనసాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 10 నుండి ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది చర్చ కొనసాగుతోంది. గతంలో డేంజర్ జోన్లో ఉన్న యాంకర్ వర్షిణి, కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధించి తనను తాను కాపాడుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదవ వారపు ఎలిమినేషన్‌కు సిద్ధమవుతోంది. షోలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. టాస్క్‌లలో కంటెస్టెంట్ల ప్రదర్శనను బట్టి వారికి పడే ఓట్ల సంఖ్యలో మార్పులు వస్తున్నాయి. గతంలో డేంజర్ జోన్లో ఉన్న యాంకర్ వర్షిణి, కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి సురక్షితంగా నిలిచారు.
మరోవైపు, ‘ఎవిక్షన్ పవర్ పాస్’ కలిగి ఉన్న ఝాన్సీ దానిని ఉపయోగించి సుధీర్‌ను ఎలిమినేషన్ నుండి కాపాడారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం ప్రస్తుతం ఝాన్సీ , శివ అత్యల్ప ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నారు. అంటే ఈ వారాంతంలో వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశం ఉంది. బిగ్ బాస్ తెలుగు 10 ప్రస్తుతం స్టార్ మా , జియో హాట్‌స్టార్ లో ప్రసారమవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో త్రిగుణ్, రోహిత్, యాంకర్ వర్షిణి, శ్వేత నాయుడు, నీతూ నటరాజ్, నరేష్, రామ్ ప్రసాద్ తదితరులు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు.


















