రేవంత్ రెడ్డికి ఝ‌ల‌క్ ప‌ర‌కాల నుంచే పోటీ చేస్తా

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కొండా సుష్మితా ప‌టేల్

hellotelugu-KondaSushmithaa

వ‌రంగ‌ల్ జిల్లా : అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కంట్లో న‌లుసుగా మారింది మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ. ఇప్ప‌టికే డ‌బ్బులు వ‌సూలు చేసే విష‌యంలో త‌న కూతురు కొండా సుష్మిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఏకంగా సీఎం ను, ఆయ‌న ఫ్యామిలీని ల‌క్ష్యంగా చేసుకుని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత ఇరు కుటుంబాలు కాంప్ర‌మైజ్ అయిన‌ట్లు టాక్. ఇది ప‌క్క‌న పెడితే తాజాగా కొండా సుష్మితా ప‌టేల్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. మ‌రోసారి రేవంత్ రెడ్డికి ఝ‌ల‌క్ ఇచ్చింది. తాను వ‌చ్చేసారి జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నుంచే పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వ‌క పోయినా తాను బ‌రిలో త‌ప్ప‌కుండా ఉంటాన‌ని స్ప‌ష్టం చేసింది.

తాజాగా తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైర‌ల్ గా మారాయి. ఇదిలా ఉండ‌గా ఇదే ప‌ర‌కాల శాస‌న స‌భ స్థానం నుంచి రేవంత్ రెడ్డికి స‌న్నిహితుడిగా పేరు పొందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాష్ రెడ్డికి చెక్ పెట్టింది. తల్లిదండ్రుల లాగే.. తన రాజకీయ ప్రస్థానం పరకాల నుంచి మొదలవుతుందని వెల్ల‌డించారు. తన కంటే కొండా సుస్మిత చాలా ధైర్యవంతురాలని మద్దతు ఇచ్చారు కొండా ముర‌ళి. కొండా సుస్మిత పోటీ చేయాలను కోవడంలో తప్పు లేదని కొండా సురేఖ పరోక్షంగా ప్ర‌క‌టించ‌డం విశేషం. గతేడాది కొండా సురేఖ ఓఎస్డీ వివాదంలో రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత తీవ్ర విమర్శలు చేశారు. రెడ్లందరూ కలిసి బీసీ అయిన మా అమ్మను టార్గెట్ చేశారని మీడియాలో హల్చల్ చేసింది.

 

Exit mobile version