Popular Cricketer Surya Kumar Yadav : భార‌త సైన్యానికి సూర్య కుమార్ యాద‌వ్ విరాళం

ఆసియా క‌ప్ టోర్నీలో మ్యాచ్ ల ఫీజుల‌న్నీ వారికే

Hello Telugu - Popular Cricketer Surya Kumar Yadav

Hello Telugu - Popular Cricketer Surya Kumar Yadav

Surya Kumar Yadav : దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 టోర్నీ విజేతగా నిలిచింది సూర్య కుమార్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలోని టీమిండియా. ఈ టోర్నీలో అరుదైన రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణా ర‌హితంగా పహ‌ల్గామ్ లో భారతీయుల‌పై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని నిర‌సిస్తూ పాకిస్తాన్ జ‌ట్టుతో క‌ర‌చాల‌నం చేసేందుకు నిరాక‌రించారు. అంతే కాదు ఆసియా క్రికెట్ కౌన్సిల్, పీసీబీ చైర్మ‌న్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఈ ఘ‌ట‌న యావ‌త్ క్రికెట్ లోకాన్ని, క్రీడా రంగాన్ని విస్తు పోయేలా చేసింది. టోర్నీ ముగిసిన అనంత‌రం భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ (Surya Kumar Yadav) మీడియాతో మాట్లాడారు.

Surya Kumar Yadav Donates

తాము గెలిచిన ఈ క‌ప్ ను , గెలిచిన ప్ర‌తి మ్యాచ్ ను భార‌త దేశానికి, ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పెహ‌ల్గామ్ బాధితులు, ఆర్మీకి అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంతే కాదు తాము ఆడిన మ్యాచ్ ల సంద‌ర్భంగా చెల్లించిన అన్ని ఫీజుల ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌ను పూర్తిగా భార‌త దేశ సైన్యానికి విరాళంగా ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ సంద‌ర్బంగా యావ‌త్ భార‌తీయులంతా కెప్టెన్ తీసుకున్న ఈ అసాధార‌ణ నిర్ణ‌యాన్ని ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Also Read : Asia Cup 2025 – India Team Sensational Decision : పీసీబీ చైర్మ‌న్ నుంచి ట్రోఫీ తిర‌స్క‌ర‌ణ

Exit mobile version