Asia Cup 2025 – India Team Sensational Decision : పీసీబీ చైర్మ‌న్ నుంచి ట్రోఫీ తిర‌స్క‌ర‌ణ

ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా

Hello Telugu - Asia Cup 2025 - India Team Sensational Decision

Hello Telugu - Asia Cup 2025 - India Team Sensational Decision

Asia Cup 2025 : దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) విజేత‌గా నిలిచింది. పాకిస్తాన్ కు షాక్ ఇస్తూ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సంద‌ర్బంగా ట్రోఫీని అందుకునేందుకు భార‌త జ‌ట్టు నిరాక‌రించింది. ఇప్ప‌టికే బీసీసీఐ, జ‌ట్టు మేనేజ్మెంట్ తో పాటు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాము గెలిస్తే గ‌నుక క‌ప్ ను పాకిస్తాన్ చీఫ్ నుంచి తీసుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటో కూడా వివ‌ర‌ణ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌మ్మూ కాశ్మీర్ లోని పహ‌ల్గామ్ లో 26 మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. దీనికి నిర‌స‌న‌గా తాము మ్యాచ్ లు ఆడ‌తామ‌ని ట్రోఫీ తీసుకోమ‌ని పేర్కొన్నారు. అన్న‌ట్టుగానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ , పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్విన్ న‌ఖ్వీ నుంచి ఆసియా క‌ప్ ను తీసుకునేందుకు నిరాక‌రించారు. దీంతో త‌ను కూడా ర‌న్న‌ర్ అప్ ట్రోఫీని తీసుకోవ‌ద్దంటూ పాకిస్తాన్ జ‌ట్టుకు సూచించాడు.

Asia Cup 2025 Updates

ఈ న‌ఖ్వీ పాకిస్తాన్ ప్ర‌భుత్వంలో మంత్రిగా కొన‌సాగుతున్నారు. ఇదే స‌మ‌యంలో పీసీబీకి చైర్మ‌న్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారత ఆటగాళ్ళు 15 గజాల దూరంలో నిలబడి, తమ స్థానాల నుండి కదలడానికి నిరాకరించారు. విజేతల ట్రోఫీని ఎవరు ప్రదానం చేయాలో భారత జట్టు యాజమాన్యం అడిగినట్లు తెలిసింది . నఖ్వీ ప్రెజెంటేషన్ వేదికపైకి వచ్చిన తర్వాత, స్టాండ్స్‌లో ఉన్న భారతీయ అభిమానులు “భారత్ మాతా కీ జై” నినాదాలతో సామూహికంగా కేకలు వేయడం ప్రారంభించారు. నఖ్వీ వేచి ఉండగా, అకస్మాత్తుగా, నిర్వాహకులలో ఒకరు డ్రెస్సింగ్ రూమ్ లోపల ట్రోఫీని తీసుకున్నారు. అంతే కాకుండా పాకిస్తాన్ ఆట‌గాళ్ల నుంచి క‌ర‌చాల‌నం తీసుకునేందుకు కూడా నిరాక‌రించారు.

Also Read : IND vs PAK- Kuldeep Yadav Sensational Bowling : కుల్దీప్ యాద‌వ్ క‌మాల్ పాక్ ఢ‌మాల్

Exit mobile version