Popular Cricketer Suresh Raina : తమిళ సినిమాలో క్రికెట‌ర్ సురేష్ రైనా

ప్ర‌క‌టించిన నిర్మాత శ‌ర‌వ‌ణ కుమార్

Hello Telugu - Popular Cricketer Suresh Raina

Hello Telugu - Popular Cricketer Suresh Raina

Suresh Raina : భార‌తీయ క్రికెట్ లో ప‌లు విజ‌యాల‌లో కీల‌క భూమిక వ‌హించి ప్ర‌స్తుతం ఆట‌కు దూరంగా ఉన్న క్రికెట‌ర్ సురేష్ రైనా సంచ‌ల‌నంగా మారారు. త‌ను క్రికెట‌ర్ గా అంద‌రికీ గుర్తు ఉన్న‌ప్ప‌టికీ చాలా కాలం పాటు త‌మిళ స‌మాజంతో సంబంధం క‌లిగి ఉన్నాడు. త‌ను ఐపీఎల్ లో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో భాగం అయ్యాడు. ప్ర‌త్యేకించి మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించాడు. చాలా గెలుపుల్లో త‌ను కూడా ఉన్నాడు. ఈ సంద‌ర్బంగా అక్క‌డి ఫ్యాన్స్ అంతా ధోనీ త‌ర్వాత రైనాను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు.

Suresh Raina in Tamil Movie

దీనిని ఆధారంగా చేసుకుని సురేష్ రైనాతో (Suresh Raina) ఓ క్రికెట్ ఆధారంగా సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు త‌మిళ సినీ నిర్మాత శ‌ర‌వ‌ణ కుమార్. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్ట‌లేదు. కానీ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ వ‌న్ అని తాత్కాలికంగా పేరు పెట్టామ‌న్నారు. త‌న‌కు చెందిన నిర్మాణ సంస్థ డ్రీమ్ నైట్ స్టోరీస్ (డీకేఎస్) ద్వారా దీనిని నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సురేష్ రైనాతో తీసే మూవీకి లోగ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు తెలిపాడు. ఈ ర‌కంగా రైనా త‌మిళ చిత్రంలో న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు క్రికెట‌ర్. తాజాగా సీఎస్కేలో పంచ్ హిట్ట‌ర్ పాత్ర పోషిస్తున్న క్రికెట‌ర్ శివ‌మ్ దూబే నిర్మాణ సంస్థ పేరుతో పాటు లోగోను ఆవిష్క‌రించారు చెన్నైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.

ఇదిలా ఉండ‌గా స‌మ్మ‌ర్ వెకేష‌న్ లో భాగంగా ప్ర‌స్తుతం సురేష్ రైనా అమ్ స్ట‌ర్ డామ్ లో ఉన్నాడు . ఈ సంద‌ర్బంగా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నాడు. స‌మాచారం ఆల‌స్యంగా అంద‌డంతో తాను రాలేక పోయాన‌ని, కానీ సినిమాలో భాగం పంచుకోవ‌డం మ‌రింత ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని చెప్పాడు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు లోగ‌న్ త‌న‌కు క‌థ చెప్పాడ‌ని, త‌ను విన్న వెంట‌నే ఓకే చెప్పాన‌ని తెలిపాడు.

Also Read : Popular Actress Bhavana : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి భావన

Exit mobile version