హైదరాబాద్ : తెలుగు చిత్రసీమలో సహాయ నటిగా పలు సినిమాల్లో నటించిన సురేఖా వాణి ప్రస్తుతం సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమైన వీడియోనా లేక ఏఐ సాంకేతికతతో సృష్టించినదా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సురేఖా వాణి అసలు విషయాన్ని వెల్లడిస్తూ ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చారు. తన అనుమతి లేకుండానే ఈ వీడియోను ప్రచారం చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేసింది.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తద్వారా తన వ్యక్తిగత కంటెంట్ తన అనుమతి లేకుండానే ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతోందని సురేఖా వాణి పేర్కొన్నారు . సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో మీమ్ పేజీలు, మీడియా సంస్థలు , పాత్రికేయులు ఈ కంటెంట్‌ను షేర్ చేయవద్దని లేదా ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. ఈ వీడియోను ఇంకా ఎవరైనా షేర్ చేస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కేవలం వ్యూస్ , సోషల్ మీడియా రీచ్ లేదా ప్రచారం కోసం ఇటువంటి పరిస్థితులను ఎవరూ ఉపయోగించు కోకూడదని ఆమె స్పష్టం చేశారు.
తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరిన నటి, ఈ విషయాన్ని చాలా తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు
సురేఖా వాణి చేసిన ఈ ప్రకటన ఆన్లైన్ గోప్యత , వ్యక్తిగత కంటెంట్ దుర్వినియోగం అనే అంశాలపై చర్చకు దారితీసింది. అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలను ఉపయోగించుకుని ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, తమ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సోషల్ మీడియా పేజీల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

















