Supreme Court Shocking – Sushil Kumar : రెజ్లర్ సుశీల్ కుమార్ కు సుప్రీం షాక్

ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ర‌ద్దు

Hello Telugu - Supreme Court Shocking - Sushil Kumar

Hello Telugu - Supreme Court Shocking - Sushil Kumar

Sushil Kumar : ఢిల్లీ – ప్ర‌ముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్ప‌టికే మంజూరు చేసిన బెయిల్ ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వారం రోజుల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసులో గతంలో సుశీల్ కుమార్ (Sushil Kumar) కు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇదిలా ఉండ‌గా దేశ రాజధానిలోని ఛత్రసల్ స్టేడియంలో జరిగిన మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ హత్య కేసులో కీల‌క‌మైన నిందితుడిగా ఉన్నారు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ (Sushil Kumar) . ఈ సందర్భంగా త‌న‌పై కేసు న‌మోదు చేశారు. ఆపై విచార‌ణ నిమిత్తం అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లాడు. అక్క‌డ విచార‌ణ చేప‌ట్టిన డిల్లీ హైకోర్టు త‌న‌కు బెయిల్ మంజూరు చేసింది.

Supreme Court Shocking Wrestler Sushil Kumar

దీనిని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక బాధ్య‌త క‌లిగిన క్రీడాకారుడిగా భావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకోక పోతే ఎలా అని ప్ర‌శ్నించింది ధ‌ర్మాస‌నం. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ హైకోర్టు ఎలా త‌న‌కు బెయిల్ మంజూరు చేసిందంటూ నిల‌దీసింది. తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. కాగా ఢిల్లీ హైకోర్టు మార్చి 4న రెజ్లర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది.

వారంలోపు లొంగి పోవాలని రెజ్లర్‌ను ఆదేశించింది. లేక‌పోతే తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ వార్నింగ్ ఇచ్చింది. మే 2021లో ఆస్తి వివాదంపై ధంకర్‌పై ప్రాణాంతకంగా దాడి చేసినట్లు కుమార్, ఇతరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ దాడిలో ధంకర్ స్నేహితులు ఇద్దరు కూడా గాయపడ్డారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, మొద్దుబారిన వస్తువు ఢీకొనడం వల్ల ధంకర్ మెదడు దెబ్బతింద‌ని తేలిపింది. ఆ వ‌స్తువు రెజ్ల‌ర్ దేన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

Also Read : YS Jagan Shocking Comments : ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లు విఫ‌లం

Exit mobile version