Hero Darshan – Supreme Court : కన్నడ హీరో దర్శన్‌ను అరెస్ట్ చేయాల్సిందే

సంచ‌ల‌న తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు

Hello Telugu - Hero Darshan - Supreme Court

Hello Telugu - Hero Darshan - Supreme Court

Supreme Court : ఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువరించింది. కన్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టుడు ద‌ర్శ‌న్ కు బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ని తేల్చి చెప్పింది. న్యాయం, చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానమేన‌ని, ఎవ‌రూ దానికి అతీతులు కార‌ని పేర్కొంది. కస్టడీలో దర్శన్‌కు, మిగతా నిందితులకు ఎలాంటి ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్లు ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కర్ణాటక హైకోర్టు గత సంవత్సరం డిసెంబర్ 13న ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ తీర్పును పక్కన పెడుతూ, దర్శన్‌ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు (Supreme Court). ఏ వ్యక్తి కూడా చట్టానికి అతీతం కాదు లేదా చట్టానికి అతీతం కాదంటూ స్ప‌ష్టం చేసింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్‌ను రద్దు చేసింది. ఈ కేసుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

Supreme Court of India Key Comments on Hero Darshan

నటుడు దర్శన్ తూగుదీపకు డిసెంబర్ 13, 2024న కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పులో అతనికి ఉపశమనం లభిస్తుందని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు తీవ్రమైన చట్టపరమైన లోపాలతో తీర్పు ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జూన్‌లో రేణుకస్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్టు అయ్యారు. ద‌ర్శ‌న్ స‌హా నిందితులు ప్ర‌దూష్ రావు, జ‌గ‌దీష్ అలియాస్ జ‌గ్గు, అను కుమార్, ఎం. లక్ష్మ‌ణ్‌, నాగ‌రాజుల‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీర్పు సంద‌ర్భంగా కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. క‌ర్ణాట‌క హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల్లో బెయిల్ ఇచ్చేందుకు గ‌ల కార‌ణాల‌ను స్ప‌ష్టంగా పేర్కొన లేదు. ఐపీసీ సెక్ష‌న్లు 32, 34 కింద బెయిల్ మంజూరు చేయ‌డం స‌బ‌బు కాద‌ని పేర్కొంది సుప్రీం ధ‌ర్మాస‌నం.

Also Read : Popular Actress Shilpa Shetty : రూ. 60 కోట్ల మోసం న‌టి శిల్పా, కుంద్రాపై కేసు

Exit mobile version