ఉమ‌ర్ ఖ‌లీద్, ష‌ర్జీల్ ఇమామ్ ల‌కు సుప్రీం షాక్

బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పిన కోర్టు

hellotelugu-Supremmecourt

ఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు మ‌రోసారి బిగ్ షాక్ త‌గిలింది. బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు బాధితుల త‌ర‌పున‌. కేసును సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. ఈ సందర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ ఉమ‌ర్, ష‌ర్జీల్ ల‌కు బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఇదే కేసులో పేరున్న మరో ఐదుగురికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్ , షాదాబ్ అహ్మద్‌లకు ఎస్సీ బెయిల్ మంజూరు చేసింది. ప్రాసిక్యూషన్ , సాక్ష్యం పరంగా ఉమర్ ఖలీద్ , షర్జీల్ ఇమామ్ గుణాత్మకంగా భిన్నమైన ప్రాతిపదికన ఉన్నారని కోర్టు గుర్తించింది.

ఆరోపించిన నేరాలకు వారి పాత్రలు కేంద్రంగా ఉన్నాయని అభిప్రాయ‌ప‌డింది సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం. ఈ ఇద్దరి విషయానికి వ‌స్తే జైలు శిక్ష కొనసాగుతుందని స్ప‌ష్టం చేసింది. గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్ , షాదాబ్ అహ్మద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ అరవింద్ కుమార్ , ఎన్వి అంజరియాలతో కూడిన ఎస్సీ బెంచ్ తీర్పును వెలువరించింది. అంతకు ముందు, అన్ని పార్టీల నుండి వివరణాత్మక వాదనలు విన్న తర్వాత, సుప్రీం కోర్టు డిసెంబర్ 10న తన తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ కోరుతూ వారి పిటిషన్ల విచారణ సందర్భంగా, వారి తరపున హాజరైన న్యాయవాదులు ఎక్కువగా విచారణ ఆల‌స్యం కావ‌డాన్ని ప్రత్యేకంగా ప్ర‌స్తావించారు.

Exit mobile version