Supreme Court not Approved : అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు త‌గ‌దు

స్ప‌ష్టం చేసిన సుప్రీంకోర్టు

Hello Telugu - Supreme Court not Approved

Hello Telugu - Supreme Court not Approved

Supreme Court : ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని కోరుతూ ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

Supreme Court of India not Approved for Assembly Seats Expansion

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కోసం దాఖలైన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం తిరస్కరించింది . రాజ్యాంగ నిబంధనల ప్రకారం, 2026 తర్వాత మొదటి జనాభా లెక్కలు (సెన్సస్) పూర్తయిన తర్వాత మాత్రమే ఇటువంటి పునర్విభజన చేపట్టాలని స్ప‌ష్టం చేసింది. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రత్యేక డీలిమిటేషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు సమర్థించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురితమైన తర్వాతే డీలిమిటేషన్ సాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పిటిష‌న్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించి దాఖ‌లు చేయాల‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. ఇప్ప‌టికే విలువైన స‌మ‌యం వృధాగా మారిందంటూ పేర్కొంది. ఏదైనా జ‌నాభా గ‌ణ‌న త‌ర్వాతే అంతిమ నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా అటు ఆంధ్రప్ర‌దేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. దీనిపై ప్ర‌తిప‌క్ష‌లు మాత్రం మౌనంగా ఉంటున్నాయి.

Also Read : Minister Anam – Temples Growth : ఆల‌యాల అభివృద్దికి ప్రాధాన్య‌త – ఆనం

Exit mobile version