Minister Anam – Temples Growth : ఆల‌యాల అభివృద్దికి ప్రాధాన్య‌త – ఆనం

సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ స్వామి ద‌ర్శ‌నం

Hello Telugu - Minister Anam - Temples Growth

Hello Telugu - Minister Anam - Temples Growth

Minister Anam : విశాఖపట్నం – కూట‌మి ప్రభుత్వం ఆల‌యాల అభివృద్దికి ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి (Minister Anam). శుక్ర‌వారం సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఘనంగా మంత్రి ఆనంకు స్వాగతం పలికారు సింహాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి త్రినాథ్ రావు, పూజారులు, అర్చ‌కులు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం అందుకున్నారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

Minister Anam Ramanarayana Reddy Key Comments on Temples Development

ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై సమగ్ర సమాచారం కోరామ‌న్నారు. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. భక్తుల భద్రత, ఆలయాల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యల గురించి వివ‌రాలు అడిగారు. అన్నదానానికి నాణ్యత, భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూలైన్లు పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఈవోను ఆదేశించారు.

ప్రత్యేక పూజలు, సేవల సమయంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కూడదని, సాఫీగా దర్శనం అయ్యేలా చొరవ తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి. దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యత మెరుగు పరచాలని సూచించారు. ఆలయ ఆస్తుల పరిరక్షణపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. సింహాచలం దేవస్థానాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేయాలన్నారు. ఆలయ సేవలో ఉన్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ, వారి సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

Also Read : India UK Free Trade Agreement : భారత్ యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Exit mobile version