Paritala Sunitha : అనంతపురం జిల్లా : కూటమి సర్కార్ ఆధ్వర్యంలో చేపట్టిన సూపర్ సిక్స్ (Super Six) బంపర్ హిట్ అయ్యిందన్నారు మాజీ మంత్రి , రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha). బుధవారం అనంతపురం వేదికగా జరిగిన కూటమి బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ చీఫ్ మాధవ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ జరగడం నిజంగా మనందరి అదృష్టంగా భావించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలల్లోనే సూపర్ సిక్స్‌లోని పథకాలను అమలు చేసి, సూపర్ హిట్ కార్యక్రమాన్ని ప్రజల మధ్య విజయవంతంగా జరుపుకోవడం చంద్రబాబు నాయుడు కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు.
MLA Paritala Sunitha Key Comments
లక్షలాది మంది నాయకులు, కార్యకర్తల మధ్య జరగడం సంతోషకరమే కాకుండా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకు రావడం ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు పరిటాల సునీత. ఇది మహిళల విశ్వాసాన్ని, కూటమి పట్ల ఉన్న మమకారాన్ని చాటుతోందని చెప్పారు. సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి లబ్ధి చేకూర్చిన ఘనత లోకేష్ బాబుకి దక్కిందన్నారు. అదేవిధంగా దీపం-2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసి, మహిళలకు వంటలో ఇబ్బందులు లేకుండా చూసిన నాయకుడు మన అన్న చంద్రన్నేనని అన్నారు. సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఉపశమనం కల్పించారని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో సైకో సీఎం కారణంగా ఐదేళ్లు రైతన్నలు నరకం చూశారని ఆరోపించారు. ఎరువుల కొరత, పంట బీమా లేని స్థితి, ఇన్‌పుట్ సబ్సిడీ లోటు అన్నింటికీ రైతులు ఇబ్బంది పడ్డారని అన్నారు సునీత. కానీ కూటమి సర్కార్ కొలువు తీరాక అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ఇవాళ ఎరువులకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు సునీత. ఆగస్టు 2వ తేదీన తొలి విడతగా రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
Also Read : Minister Satya Kumar Fired on YS Jagan : జగన్ దుష్ప్రచారం సత్య కుమార్ ఆగ్రహం
