Super Six : అమరావతి : సూపర్ సిక్స్ విజయంపై రాష్ట్రంలో కూటమి పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కూటమి తొలిసారి ఉమ్మడి సభ నిర్వహిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ 15 నెలల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అనంతపురంలోని ఇంద్రప్రస్థనగర్ లో ఈ సభను నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అగ్ర నేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరు కానున్నారు.
Super Six Bumper Hit Meeting in Ananthapur
ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి సభ కావటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించటంపై ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. మొత్తంగా 15 నెలల పాలనా విజయాలను ఆవిష్కరించేలా సభను నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
పార్టీల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు ప్రజల ముందుకు కలిసి వెళ్లాయి. 94 శాతం స్ట్రైక్ రేట్ తో సాధారణ ఎన్నికల్లో కలిసి విజయం సాధించాయి. 164 సీట్లతో కనీవినీ ఎరగని విజయాన్ని దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం సంయుక్త నిర్ణయాలతోనే ప్రజా పాలన సాగిస్తున్నాయి. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరింది. ఇప్పటి వరకూ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు చెప్పాలని అగ్రనాయకత్వం భావిస్తోంది.
Also Read : Telangana Huge Rains : తెలంగాణలో పలు చోట్ల వర్షాలు
