Sunil Gavaskar Interesting Comments on Sanju : సంజూ శాంస‌న్ టైమింగ్ అద్భుతం : స‌న్నీ

భార‌త జ‌ట్టుకు ఇవాళ అత్యంత కీల‌కం

Hello Telugu - Sunil Gavaskar Interesting Comments on Sanju

Hello Telugu - Sunil Gavaskar Interesting Comments on Sanju

Sunil Gavaskar : దుబాయ్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ సామాన్యంగా ఎవ‌రినీ ప్ర‌శంసించ‌డు. ఆయ‌న ప్ర‌త్యేకించి ఆట‌గాళ్ల‌కు చుర‌క‌లు అంటిస్తూనే ఉంటారు. కానీ విచిత్రంగా ఆసియా క‌ప్ టోర్నీలో భాగంగా త‌ను ప్ర‌యోక్తగా ఉన్నాడు. ఈ టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ పోరులో భార‌త్ ప్ర‌త్య‌ర్థి ఓమ‌న్ జ‌ట్టును 21 ర‌న్స్ తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 188 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత ఓమ‌న్ 167 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఈ కీల‌క ఇన్నింగ్స్ లో కేవ‌లం 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు శుభ్ మ‌న్ గిల్. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్. 45 బంతులు ఎదుర్కొని కీల‌క‌మైన 56 ర‌న్స్ చేశాడు. జితేశ్ శ‌ర్మ‌, అక్ష‌ర్ ప‌టేల్, తిల‌క్ వ‌ర్మ రాణించారు.

Sunil Gavaskar Praises Sanju Samson

ఈ సంద‌ర్బంగా సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar) సంజూ శాంస‌న్ ఆట తీరుపై ప్ర‌శంస‌లు కురిపించాడు. త‌న టైమింగ్ అద్భుతంగా ఉంద‌న్నాడు. చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దానిని గ‌మ‌నించాడు. కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 3 ఫోర్లు 3 క‌ళ్లు చెదిరే సిక్సులు కొట్టాడ‌ని అన్నాడు. త‌ను తదుపరి మ్యాచ్‌లో 4వ స్థానంలో లేదా 5వ స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు. ఆఫ్ సైడ్ లో కొట్టాలా లేక లెగ్ సైడ్ లో కొట్టాలా అనేది చాలా తక్కువ మంది బ్యాటర్లకు మాత్రమే ఉంటుంది. సంజు సామ్సన్ అలాంటి బ్యాటర్లలో ఒకడు అని గవాస్కర్ పేర్కొన్నాడు. తాజాగా స‌న్నీ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : Smriti Mandhana Sensational Record : స్మృతి మంద‌న్నా ఫాస్టెస్ట్ సెంచ‌రీతో రికార్డ్

Exit mobile version