India : ఢిల్లీ : భారత, శ్రీలంక దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఇరు దేశాధినేతలు సిద్దం అవుతున్నారు. ఈ సందర్బంగా శ్రీలంక (Sri Lanka) అధ్యక్షుడితో తాను మరోసారి భేటీ కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ సామాజిక వేదికగా పేర్కొన్నారు. శ్రీలంక ప్రధానమంత్రి అమరసూర్యను స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు. తమ ఇద్దరి మధ్య చర్చలు విద్య, మహిళా సాధికారత, ఆవిష్కరణ, అభివృద్ధి సహకారం, మత్స్యకారుల సంక్షేమం వంటి విస్తృత రంగాలను కవర్ చేశాయన్నారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షుడు దిసానాయకకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఇదిలా ఉండగా డిల్లీలో శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్యను కలిశారు. ఈ ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చలు జరిపారు.
India-Sri Lanka Strong Bond
అక్కడ ఇద్దరు నాయకుల మధ్య కీలకమైన పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు నరేంద్ర మోదీ.
టెలివిజన్ ఛానల్, ఒక థింక్ ట్యాంక్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అమరసూర్య భారతదేశాన్ని దీర్ఘకాలిక విశ్వాస భాగస్వామిగా అభివర్ణించారు. 1998లో సంతకం చేసిన రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశం ప్రపంచ పెరుగుదల సమగ్ర విధానాన్ని గుర్తించారు. మూడు సంవత్సరాల క్రితం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని గుర్తు చేశారు. సవాళ్లు ఉన్నప్పటికీ తన దేశం ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోలేదని అమరసూర్య అన్నారు. శ్రీలంక ప్రభుత్వం రుణాన్ని పునర్నిర్మించడం, పాలనను ఆధునీకరించడం , ప్రజా సేవలను డిజిటలైజ్ చేస్తోందని చెప్పారు.
Also Read : Afghanistan Cricketers Death : పాకిస్తాన్ వైమానిక దాడుల్లో ఆఫ్గాన్ క్రికెటర్లు మృతి


















