Stock Market Sensational : నేడు నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ 150 పాయింట్లు క్షీణించి 82,151 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 25,238 వద్ద కొనసాగుతోంది...

Hello Telugu - Stock Market Sensational

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 22, 2025) నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు క్షీణించి 82,151 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 25,238 వద్ద కొనసాగుతోంది.

Stock Market – ఐటీ షేర్ల పతనం

అమెరికా కొత్తగా హెచ్-1బీ వీసాలపై $100,000 ఒకేసారి ఫీజు విధించడం ఐటీ కంపెనీలకు తీవ్ర దెబ్బతీసింది. ఫలితంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్ఎస్ఎల్ టెక్నాలజీస్ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% పడిపోయింది. మిడ్‌స్మాల్ ఐటీ, టెలికాం రంగాలు 1.75% తగ్గాయి.

లాభాల్లో కొనసాగిన రంగాలు

ఇదే సమయంలో SBI లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటో కార్ప్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, మీడియా, మెటల్ రంగాలు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుండగా, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

గ్లోబల్ మార్కెట్ల ప్రభావం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ఫోన్ సంభాషణ తర్వాత ఆసియా మార్కెట్లు (Stock Market) పాజిటివ్ సెంటిమెంట్‌తో పెరిగాయి. రాబోయే ఆసియా ఆర్థిక సహకార సదస్సులో జిన్‌పింగ్‌ను కలుస్తానని ట్రంప్ ప్రకటించడంతో జపాన్ నిక్కీ 1.4%, దక్షిణ కొరియా కోస్పి 0.9% లాభపడ్డాయి.
శుక్రవారం వడ్డీ రేటు కోతల అంచనాల మధ్య వాల్ స్ట్రీట్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. S&P 500 – 0.49%, నాస్‌డాక్ – 0.72% పెరిగాయి.

IPOల కదలికలు

Also Read : Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు

Exit mobile version