విశాఖపట్పం జిల్లా : రాష్ట్రంలోని జైళ్లను దేశంలోనే రోల్ మోడల్ గా ఉండేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నంలోని సాయి ప్రియా రిసార్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 9వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఏపీ జైళ్ల శాఖ నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఖైదీలు తయారు చేసిన వస్తువుల స్టాల్స్‌ను పరిశీలించారు మంత్రి వంగలపూడి అనిత. కాన్ఫరెన్స్‌లో భాగంగా జైళ్ల ఆధునీకరణ, ఖైదీల్లో పరివర్తన తీసుకు రావడానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. .
జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, సమాజానికి నైతిక విలువలు గల వ్యక్తులను తీర్చిదిద్దే సంస్కరణా కేంద్రాలుగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు అనిత వంగలపూడి.
ఇదే సమయంలో సమర్థవంతుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ ఏపీ , జైళ్ల శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడం జరిగిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ నాయకత్వంలో క్రిమినల్ లా సంస్కరణలు, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం అని ప్రశంసలు కురిపించారు అనిత వంగలపూడి. ప్రతి జైలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, రాజధాని అమరావతిలో నూతన కేంద్ర కారాగారం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జైళ్లు , కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ అంజనీ కుమార్ గారితో పాటు వివిధ రాష్ట్రాల జైళ్ల శాఖల అధికారులు పాల్గొన్నారు.
