Sri Malayappa : తిరుమల : తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు (Sri Malayappa) ఉభయ దేవేరులతో కలిసి దర్శనం ఇవ్వనున్నారు. సర్ప రాజైన ఆది శేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామి వారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
Sri Malayappa Darshan Updates
శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్రనా మాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బల రామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆది శేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామి వారు, దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింప చేస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది స్వామి దర్శనం కోసం. ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా.
Also Read : Tirumala Rains Sensational : తిరుమలలో కళ కళ లాడుతున్న జలాశయాలు
