శ్రీలంక : శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీలకు పెన్షన్లు అవసరం లేదంటూ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించి చట్టానికి ఆమోదం లభించింది . ఎంపీలు ప్రజా సేవకులని, వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఎంపీలు దానికి అర్హులని ప్రజలు అనుకోవడం లేదన్నారు. శ్రీలంక ఎంపీల పెన్షన్లను రద్దు చేయడం పట్ల ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు పదవి నుండి వైదొలిగిన తర్వాత సామాజిక భద్రతను నిర్ధారించడానికి పెన్షన్ అవసరమని అన్నారు. వీళ్లకు పెన్షన్లు ఇవ్వాలని ప్రజలు అనుకోవడం లేదంటూ పేర్కొంది పార్లమెంట్ . మునుపటి చట్టం ప్రకారం పార్లమెంటు సభ్యులు 5 సంవత్సరాలు పదవిలో ఉన్న తర్వాత పెన్షన్‌కు అర్హులుగా ఉండేవాళ్లు.
కానీ ప్రజల అవసరాల దృష్ట్యా పెన్షన్లు ఎందుకు ఇవ్వాలనే దానిపై ప్రజలు చర్చించు కుంటున్నారని పేర్కొన్నారు న్యాయ శాఖ మంత్రి హర్షనా నానాయక్కర. తక్షణమే పెన్షన్లను నిలిపి వేయాలని ఓటు వేస్తూ చెప్పారు.మాజీ అధ్యక్షుల నుండి గృహాలు, వాహనాలు, వేలాది మంది అంగరక్షకులను ఉపసంహరించుకున్న కొన్ని నెలల తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ప్రభుత్వం 49 ఏళ్ల పార్లమెంటరీ పెన్షన్ల చట్టాన్ని రద్దు చేసింది. అధికార పార్టీకి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్న 225 మంది సభ్యుల శాసనసభలో, పెన్షన్ చట్టాన్ని రద్దు చేయడానికి అనుకూలంగా 154 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా కేవలం ఇద్దరు మాత్రమే ఓటు వేశారు.
