అమరావతి : శ్రీని రాజు ఆధ్వర్యంలో తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం లాంటిదన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతిలోని శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఇది నిజంగా ఏపీ యూత్ కి ఒక పెద్ద గిఫ్ట్. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని నా నమ్మకం. ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో మేం మాట్లాడుకున్నట్టుగా.. ఈ క్యాంపస్ లో ఏడాదికి 5,000 మంది స్టూడెంట్స్ తో స్టార్ట్ చేస్తున్నాం. దానికి నేను ‘కండిషన్స్ అప్లై’ అని ట్యాగ్ పెడతాను. క్యాంపస్ లో 5 వేల మందే అయినా.. మన జర్నీలో మున్ముందు ఇంకా చాలా ఎక్కువ మందే వస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈరోజు కేవలం ఇంకో కొత్త యూనివర్సిటీని స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కొత్తగా ఆలోచించే విధానానికి ఇది ఒక పునాది అని భావిస్తున్నాను.
ఇండియాకి ఇప్పుడు నిజంగా కావాల్సింది ఇదే. నిన్న నేను రాష్ట్రపతి , ధర్మేంద్ర ప్రధాన్ జీ లాంటి చాలామంది ప్రముఖుల్ని కలిశాను అని తెలిపారు మంత్రి నారా లోకేష్. మన ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ భవిష్యత్ ఎలా ఉండాలనే దానిపై మా మధ్య చాలా డిస్కషన్ జరిగిందని చెప్పారు. మనం ఇస్తున్న డిగ్రీల సిస్టమ్ లో కచ్చితంగా మార్పు (reset) రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఇన్నేళ్లుగా.. ఎన్ని డిగ్రీలు ఇచ్చారు, ఎంతమంది పాస్ అయ్యారు అనే దాన్ని బట్టే యూనివర్సిటీల రేంజ్ ని కొలిచేవారు. కానీ ఇకముందు, మనం సొసైటీలో ఎలాంటి మార్పు తీసుకొస్తున్నాం అనేదాన్ని బట్టే మనల్ని అంచనా వేస్తారని నేను నమ్ముతున్నానని చెప్పారు.
