Beauty Sreeleela : వారెవ్వా శ్రీ‌లీల వైర‌ల్ వ‌య్యారి అదుర్స్

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్

Hello Telugu - Beauty Sreeleela

Hello Telugu - Beauty Sreeleela

Sreeleela : మైనింగ్ డాన్ గా పేరు పొందిన క‌ర్ణాట‌క‌కు చెందిన ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కొడుకు కీల‌క రోల్ పోషించిన మూవీ జూనియ‌ర్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ , సాంగ్ , సినిమా ప‌రంగాప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వైర‌ల్ వ‌య్యారి పేరుతో వ‌చ్చిన ఈ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. డ్యాన్స్ లో ఇర‌గ‌దీసేందుకు రెడీగా ఉన్న అందాల సుంద‌రి శ్రీ‌లీల (Sreeleela) మ‌రోసారి సూప‌ర్ గా న‌టించింది. కుర్ర‌కారు గుండెల‌ను ల‌బ్ డ‌బ్ అనేలా చేసింది.

Sreeleela Movie Updates

తెలుగు సినిమా డ్యాన్సింగ్ క్వీన్ గా ఇప్ప‌టికే పేరు పొందింది. చిన్న విరామం తర్వాత తన సిగ్నేచర్ మూవ్స్ ని ప్రదర్శించడానికి తిరిగి వచ్చింది. కిరీటి రెడ్డి తొలి చిత్రం జూనియర్ లో న‌టించింది. ఆమెకు ధీటుగా సూప‌ర్ గా చేశాడు. డ్యాన్స్ చేయ‌డం ఆక‌ట్టుకునేలా ఉంది.

దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రంలోని తాజా పాట వైరల్ వయ్యారి శ్రీలీల గ్లామర్ ,అసాధారణమైన నృత్య నైపుణ్యాన్ని హైలైట్ చేసింది. ఈ పాట‌ను దేవిశ్రీ ప్ర‌సాద్ , హరిప్రియలు ఉత్సాహ భ‌రితంగా పాడారు. గేయ రచయిత కళ్యాణ్ చక్రవర్తి రాశారు. తెరపై కిరీటి, శ్రీలీల స్టైలిష్ ఎనర్జిటిక్ కొరియోగ్రఫీతో డ్యాన్స్ ఫ్లోర్‌ను వెలిగించారు. కిరీటి తన గాత్రదానంతో ఆకట్టుకుంటుండగా, శ్రీలీల తన అప్రయత్నమైన గాంభీర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్ర‌ధానంగా పాట‌లో మ‌రీ రెచ్చి పోయి న‌టించింది శ్రీ‌లీల‌. కిరీటిరెడ్డి మ‌రి దూకుడు పెంచాడు. శ్రీలీల‌కు పోటీగా మారడం విస్మ‌యానికి గురి చేసింది.

Also Read : Hero Pawan-Hari Hara Veera Mallu Price Hike : హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టికెట్ ధ‌ర‌లు భారీగా పెంపు

Exit mobile version