Hero Pawan-Hari Hara Veera Mallu Price Hike : హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టికెట్ ధ‌ర‌లు భారీగా పెంపు

సామాన్య ప్రేక్ష‌కుల‌కు కోలుకోలేని బిగ్ షాక్

Hello Telugu - Hero Pawan-Hari Hara Veera Mallu Price Hike

Hello Telugu - Hero Pawan-Hari Hara Veera Mallu Price Hike

Hari Hara Veera Mallu : అమ‌రావతి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌లతో పాటు నిధి అగ‌ర్వాల్ క‌లిసి న‌టించిన మూవీ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu). దీనిని ప్ర‌ముఖ నిర్మాత ఎంఎం రత్నం నిర్మించారు. జ్యోతి కృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. జూలై 24న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని నిర్మాత‌, మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. ఈనెల 23న సినిమా ప్రీమియ‌ర్ షోస్ ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఆనంద ప‌డుతున్నారు.

Hari Hara Veera Mallu Movie Price Hike

నిర్మాత ఎంఎం ర‌త్నం చేసిన విన‌తికి ఏప స‌ర్కార్ సానుకూలంగా స్పందించింది. భారీ ఎత్తున టికెట్ ధ‌ర‌లు పెంచేందుకు ఓకే చెప్పింది. అయితే సామాన్య ప్రేక్ష‌కుల‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. అయితే సినిమా నిర్మాతలు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయ‌డం ప‌ట్ల కొంద‌రు అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

పెరిగిన ధ‌ర‌లు సింగిల్ స్క్రీన్స్ రూ. 855.50 వ‌ర‌కు, మ‌ల్టీ స్క్రీన్స్ రూ. 885 వ‌ర‌కు ఉండ‌నున్నాయి. ఈ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా ప్రీమియర్ కోసం ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరలలో ఇదే కావ‌డం విశేషం. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి హీరో అవతారంలో తిరిగి తెరపైకి రావడం చుట్టూ ఉన్న అభిమానుల కోలాహలాన్ని ఉపయోగించు కోవడం దీని లక్ష్యం కావ‌డం గమ‌నార్హం. అయితే రెగ్యుల‌ర్ షోస్ మొద‌టి 10 రోజులు కూడా ఇవే రేట్లు ఉండ‌నున్నాయి. ఇక సింగిల్ స్క్రీన్లు రూ. 297.50 వ‌ర‌కు, మ‌ల్టీ ప్లెక్స్ లు రూ. 377 వ‌ర‌కు ఉంటాయి.

Also Read : Minister Ashwini Vaishnaw Proven : అశ్విని వైష్ణ‌వ్ తెలంగాణ‌కు ఖుష్ క‌బ‌ర్

Exit mobile version