హైదరాబాద్ : రాజ్ కుమార్ పెరియర్ స్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓం. ఈ సినిమా రేపు నవంబర్ 20వ తేదీ శుక్రవారం విడుదల కానుంది. ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు ధనుష్, శ్రీలీల, మమ్మట్టి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది . ఓం సినిమాలో ధనుష్ సరసన భార్యగా నటించనుంది శ్రీలీల. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల ‘రోజా’ అనే పాత్రను పోషిస్తున్నారు. తిరువన్నామలైకి చెందిన ఈ యువతికి చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది.
రోజా పాత్ర గురించి మాట్లాడుతూ తన భర్తతో ఎక్కువ సమయం గడపాలని ఆ పాత్ర కోరుకుంటుందని శ్రీలీల తెలిపారు. ఇది చాలా సాధారణ కోరికలా అనిపించినప్పటికీ, రోజా దృష్టిలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆమె వివరించారు. ఆ పాత్రలోని భావోద్వేగాలను, మౌనాన్ని గమనించడం ద్వారా తాను ఆ పాత్రను మరింత బాగా అర్థం చేసుకోగలిగానని శ్రీలీల పేర్కొన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో ధనుష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి , శ్రీలీల కలయిక ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది.
