‘జ‌న‌వ‌రి 12 విడుద‌ల నైజాం’ రైట్స్ దిల్ రాజుకు

ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ రావిపూడి

hellotelugu-DilRaju

హైద‌రాబాద్ : విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన తాజా చిత్రం జ‌న‌వ‌రి 12 విడుద‌ల‌. టాలీవుడ్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ భారీ అంచ‌నాలు పెంచేలా చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ‘జనవరి 12 విడుద‌ల’ చిత్రానికి నిజాం పంపిణీ హక్కులను దిల్‌రాజు దక్కించుకున్నారు. నిర్మాత , పంపిణీదారుగా పేరు పొందారు దిల్ రాజు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖ‌రి ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే గోవా ప‌రిస‌రాల‌లో, ఇత‌ర దేశాల‌లో దీనిని చిత్రీక‌రించారు. ఇందులో విక్ట‌రీ వెంక‌టేశ్ , కీర్తి సురేష్ , నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల కానున్న ప్రధాన చిత్రాలలో ఈ చిత్రం ఒకటి.

దిల్‌రాజు తన పంపిణీ సంస్థ అయిన ఎస్‌విసి రిలీజ్ ద్వారా ఈ హక్కులను దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. విజయవంతమైన వినోదాత్మక చిత్రాలను అందించిన తర్వాత వెంకటేష్‌తో మరోసారి జత కడుతున్నారు అనిల్ రావిపూడి. ఈ కలయిక తెలుగు సినీ ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. షైన్ స్క్రీన్స్ నిర్మించిన , సురేష్ ప్రొడక్షన్స్ , జీ స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర నిర్మాతలు ఇప్పటికే 2027, జనవరి 12వ తేదీని ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీగా ప్రకటించారు.

ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి, తొలి సింగిల్ కూడా కొద్ది రోజుల్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. దిల్ రాజు నిజాం డిస్ట్రిబ్యూషన్‌ను నిర్వహిస్తుండటంతో ఈ చిత్రం ఒక భారీ సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version