Speaker Ayyannapatrudu Important Update : మంత్రుల స‌హ‌కారం వ‌ల్లే భ‌వ‌న నిర్మాణం

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు

Hello Telugu - Speaker Ayyannapatrudu Important Update

Hello Telugu - Speaker Ayyannapatrudu Important Update

Speaker Ayyannapatrudu : అమరావతి : ఏపీ మంత్రుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో చీప్ విప్, విప్ ల కోసం నిర్మించిన భవనాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ భవనంలో చీప్ విప్, విప్ ల కోసం 16 క్యాబిన్ లు, అదేవిధంగా డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు.

Speaker Ayyannapatrudu Key Comments

ఈ సందర్భంగా అయ్య‌న్న పాత్రుడు (Speaker Ayyannapatrudu) మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని మంత్రి డాక్టర్ నారాయణ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో పూర్తి చేయగలిగామని అన్నారు. ఈ సంద‌ర్బంగా వారిని అభినందిస్తున్న‌ట్లు చెప్పారు. సుమారు ఐదు కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టగా, కేవలం 3 కోట్ల 57 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని వివరించారు. ఈ భవన నిర్మాణం పూర్తి చేయడంలో సహకరించిన మంత్రుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు అచ్చెన్నాయుడు. అదేవిధంగా మీడియా పాయింట్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ గారు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ , శాస‌న సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర , విప్పు ఆంజనేయులు, రెడ్డప్ప మాధవి, ఇతర శాసనసభ్యులు పాల్గొన్నారు.

Also Read : CM Chandrababu – TTD Growth : తిరుమల పవిత్రత పరిరక్షణకు ప్రాధాన్యం

Exit mobile version