SCR : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్తను అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు పూర్తి కావడంతో, తాత్కాలిక మార్గ మళ్లింపులు లేదా టెర్మినల్ మార్పులు చేసిన రైళ్లు ఇకపై తమ పాత మార్గాల్లోనే నడుస్తాయని అధికారులు ప్రకటించారు.
SCR – శాతవాహన ఎక్స్‌ప్రెస్ తిరిగి సికింద్రాబాద్ నుండి
పునరాభివృద్ధి పనుల కారణంగా కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ–కాచిగూడ–విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (12713/12714) మళ్లీ సికింద్రాబాద్ స్టేషన్ నుండి నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని రైళ్లు సర్వీసులు ప్రారంభించగా, మరికొన్ని ట్రైన్లు సెప్టెంబర్ 9 నుంచి పాత మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే పునరుద్ధరించిన సేవలు
- ముంబై–విశాఖపట్నం డైలీ ఎక్స్‌ప్రెస్ (18519/18520)
- విశాఖపట్నం–లింగంపల్లి–విశాఖపట్నం డైలీ ఎక్స్‌ప్రెస్ (12805/12806)
- కాజీపేట–హడప్సర్–కాజీపేట ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17014/17013)
- కాకినాడ పోర్ట్–సాయినగర్ షిర్డీ–కాకినాడ పోర్ట్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17206/17205)
త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు
- సెప్టెంబర్ 9 నుండి: మచిలీపట్నం–సాయినగర్ షిర్డీ–మచిలీపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17208/17207)
- సెప్టెంబర్ 12 నుండి: వాస్కో డ గామా–జాసిదిహ్–వాస్కో డ గామా వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17321/17322)
దక్షిణ మధ్య రైల్వే అధికారులు, “ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా అన్ని రైళ్లను దశల వారీగా పాత మార్గాల్లోకి తీసుకొస్తున్నాం. పునరాభివృద్ధి పనుల అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ మరింత ఆధునికంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారుతుంది” అని తెలిపారు.
Also Read : Zelensky Shocking Comments on Tariffs : అమెరికా సుంకాలపై యుక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు



















