South Central Railway : సికింద్రాబాద్ – దక్షిణ మధ్య రైల్వే ప్రాంత పరిధిలో చేపట్టిన రైల్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ . జోన్ పరిధిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల పురోగతి, రైల్వే కార్యకలాపాల భద్రతపై జనరల్ మేనేజర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్ర వాల్ , అన్ని ప్రధాన విభాగాధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ కు చెందిన ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్.ఎం లు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
South Central Railway Clear Instructions
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జోన్‌లోని 119 స్టేషన్లలో సుమారు రూ. 6744 కోట్లతో చేపట్టిన పునరాభివృద్ధి పనుల స్థితిగతులపై సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. వీటిలో, బేగంపేట, వరంగల్, కరీంనగర్ 3 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. వీటిని ఇటీవలే దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం, ఆరు డివిజన్ల సంబంధిత అధికారులు పునరాభివృద్ధి కోసం గుర్తించిన స్టేషన్లపై వాటి డివిజన్, ప్రాజెక్ట్ ఖర్చు, పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీ, పనులకు సంబంధించి ప్రస్తుత స్థితికి సంబంధించిన వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
జోన్ వ్యాప్తంగా 11 స్టేషన్లలో ప్రధానంగా చేపట్టిన పునరాభివృద్ధి పనుల పురోగతి స్థితిపై జనరల్ మేనేజర్ ప్రశంసించారు. ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పనుల వేగంతో కొనసాగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, పనుల నాణ్యతను తప్పకుండా నిర్ధారించాలని సూచించారు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పని ప్రదేశాలలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో, జోన్ అంతటా లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద అనుసరిస్తున్న భద్రతా జాగ్రత్తలను సంజయ్ కుమార్ సమీక్షించారు. గుర్తించబడిన ప్రమాదలకు అవకాశం గల లెవెల్ క్రాసింగ్ గేట్లపై ఆయన ప్రత్యేక దృష్టి సారించాలని, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, సిబ్బందికి కౌన్సిల్ ఇవ్వాలని అన్ని భద్రతా విధానాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
Also Read : Minister Atchannaidu Approved : పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచండి – అచ్చెన్న
