Sourav Ganguly : కోల్ కతా : పశ్చిమ బెంగాలీ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. నిన్న జరిగిన క్యాబ్ 94వ వార్షిక సదస్సులో ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నారు. గతంలో 2015-19లో క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు దాదా. తను భారత క్రికెట్‌కు నాటకీయ పునరాగమనానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా రోజర్ బిన్నీ వయస్సు కారణంగా నిష్క్రమించారు. బీసీసీఐ అధ్యక్షుడి రేసులో తను కూడా ఉన్నారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. బెంగాల్ ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు ఉంది సౌరవ్ గంగూలీకి.
Sourav Ganguly Selected as a CAB Chief
గంగూలీ నేతృత్వంలోని మొత్తం ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా బబ్లు కోలే, సంయుక్త కార్యదర్శిగా మోదన్ మోహన్ ఘోష్ , కోశాధికారిగా సంజయ్ దాస్ , ఉపాధ్యక్షుడిగా అను దత్తా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సౌరవ్ గంగూలీకి 53 ఏళ్లు. ఇప్పటి వరకు ఇదే స్థానంలో తన సోదరుడు స్నేహశీలి గంగూలీ ఉన్నాడు. లోధా కమిటీ ఆదేశాల ప్రకారం ఆరు సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ పదవులకు పరిమితి విధించిన తరువాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. రంజీ ట్రోఫీ జట్టు పనితీరు మందకొడిగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో వరుస వివాదాల వల్ల క్యాబ్ ఇమేజ్ దెబ్బతింది. ఆగస్టు ప్రారంభంలో, ఆర్థిక దుష్ప్రవర్తన ఆరోపణలపై జాయింట్-సెక్రటరీ దేబబ్రతా దాస్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు.
Also Read : CM Chandrababu-AP Growth : డ్రిప్ ఇరిగేషన్ లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్
