Smriti Mandhana Sensational : చ‌రిత్ర సృష్టించిన స్మృతీ మంద‌న్నా

ఒక సంవ‌త్స‌రంలో 1000 ప‌రుగులు

Hello Telugu - Smriti Mandhana Sensational

Hello Telugu - Smriti Mandhana Sensational

Smriti Mandhana : హైద‌రాబాద్ : భార‌త స్టార్ క్రికెట్ ప్లేయ‌ర్ స్మృతీ మంద‌న్నా (Smriti Mandhana) సంచ‌ల‌నం సృష్టించింది. అరుదైన ఘ‌నత సాధించింది. ప్ర‌స్తుతం ఐసీసీ ఉమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. ఒక ఏడాది కాలంలో 1000 ప‌రుగులు పూర్తి చేసింది స్మృతీ మంద‌న్నా. తొలి మ‌హిళా క్రికెట‌ర్ గా నిలిచింది. 29 ఏళ్ల ఓపెనర్ కూడా అయిన మంద‌న్నా మహిళల వన్డేల్లో 5,000 పరుగులు పూర్తి చేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా భారత క్రీడాకారిణి స్మృతి మంధాన ఈ ఘనత సాధించిన ఐదవ, రెండవ భారత బ్యాటర్ గా రికార్డ్ బ్రేక్ చేసింది.

Smriti Mandhana New Record Sensational

ఇక భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఆస్ట్రేలియాతో జరిగిన హై-ప్రొఫైల్ మహిళల ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్‌లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో మహిళల వన్డేల్లో 1,000 పరుగులు చేసిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది. మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా నిల‌వ‌డం విశేషం. ఈ మైలురాయిని చేరుకున్న అతి పిన్న వయస్కురాలు. అత్యంత వేగంగా 112 ఇన్నింగ్స్‌లు, 5,569 బంతుల్లోనే చేరుకుంది మంద‌న్నా. స్టెఫానీ టేలర్ 129 ఇన్నింగ్స్‌లు ఆడింది. సుజీ బేట్స్ 6,182 బంతులను అధిగమించింది. స్మృతీ మంద‌న్నా సొగసైన ఎడమచేతి వాటం బ్యాట‌ర్ . 66 బంతుల్లో 80 పరుగులు చేసింది. ప్ర‌తీకా రావ‌ల్ తో క‌లిసి 155 ర‌న్స్ పార్ట‌న‌ర్ షిప్ నెల‌కొల్పింది.

Also Read : Minister Vivek Shocking Comments : న‌న్ను కావాల‌ని టార్గెట్ చేశారు : వివేక్

Exit mobile version