Sitara : ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ గారాల ఏకైక కూతురు ఘట్టమనేని సితార (Sitara) పుట్టిన రోజు వేడుకలు ఇటీవల శ్రీలంకలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ29లో బిజీగా ఉన్నాడు. తనకు సితార అంటే పంచ ప్రాణం. ఈ ఏడాది జూలై 20వ తేదీతో కూతురుకు 13 ఏళ్లు నిండాయి. ఈ సందర్బంగా తన కుటుంబంతో కలిసి సితార బర్త్ డేను గ్రాండ్ గా నిర్వహించారు. ఇందుకు వేదికగా మారింది శ్రీలంక. తన పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబం మొత్తం వారి స్నేహితులతో కలిసి శ్రీలంకకు వెళ్లింది. పుట్టినరోజు సెలవుల సమయంలో వారు చేసిన ప్రతిదాని చిత్రాలను నమ్రత, సితార పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా సితార తన ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీస్ లో తన ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్ రాసింది.
Sitara Birthday at Sri Lanka
శ్రీలంక త్రూ యానాస్ కెమెరా అని పేర్కొంది. ఇందులో గ్రూప్ ఫోటో ఉంది. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, కొడుకు గౌతమ్ ఘట్టమనేని కూడా ఉన్నారు. పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసిన దృశ్యాలు కూడా ఆకట్టుకున్నాయి. నమ్రత తన పోస్ట్ కింద లవ్ సింబల్స్ ను షేర్ చేశారు. జూలై 20న విమానాశ్రయంలో మహేష్, సితార, గౌతమ్ , నమ్రత హైదరాబాద్ నుంచి లంకకు బయలుదేరి వెళ్లారు. సితార బుగ్గపై మహేష్ ముద్దు పెడుతున్న మధురమైన క్షణాన్ని ఒకరు కెమెరాలో బంధించారు. ఇక మహేష్ బాబు తను ఇటీవల త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారంలో నటించాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న కొత్త మూవీలో పాల్గొంటున్నాడు. ఇక కూతురు సితార జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలర్స్‌తో మోడల్‌గా కూడా అరంగేట్రం చేసింది. అంతే కాదు రిలయన్స్ ట్రెండ్స్ కోసం తన తండ్రితో కలిసి ఒక ప్రకటనలో కనిపించింది.
Also Read : Saiyaara Movie Success – Mahesh Bhatt : సైయారా సక్సెస్ మహేష్ భట్ కామెంట్స్


















