Sitaram Das Maharaj : ఉత్తర ప్రదేశ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన పాకిస్తాన్, ఇండియా తలపడుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతుంటే మరో వైపు భారత్ గెలవాలని కోరుతూ పలు ఆలయాలు పూజలతో కిట కిట లాడుతున్నాయి. ఇందులో సాధువులు, రుషులు, పూజారులు, ఆచార్యులు పాల్గొని పూజలు చేస్తున్నారు. మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అర్చనలు కూడా నిర్వహించడంలో కీలకంగా మారారు. ఇదిలా ఉండగా అయోధ్యలోని సాకేత్ భవన్ ఆలయానికి చెందిన సీతారాం దాస్ మహారాజ్ (Sitaram Das Maharaj) మాట్లాడారు.
Sitaram Das Maharaj Key Comments on India-Pakistan Match
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం పాకిస్తాన్‌ను ఓడించిందని, ఇదే సమయంలో ఇప్పుడు జరిగే కీలక పోరులో అంతిమ విజయం ఇండియాదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయోధ్యలోని సాధువులు, ఋషులు కూడా టీం ఇండియా విజయం కోసం దేవాలయాల్లో పూజలతో పాటు అర్చనలు చేశారని చెప్పారు. పాకిస్తాన్ పూర్తిగా ఎప్పుడూ దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తూ వస్తోందని కానీ దానికి ధీటుగా ఇండియా సమాధానం ఇస్తుందన్నారు సీతారాం దాస్ మహారాజ్. భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్ కుప్ప కూలిందన్నారు. ఇక ఆ దేశం కోలుకునేందుకు చాలా ఏళ్లు పడుతుందన్నారు.
ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రవాద దాడి , ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత జాతీయ క్రికెట్ జట్టు నేడు తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతోంది. ఆసియా కప్ లో టి20 ఫార్మాట్ లో ఇరు జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత జట్టు 10 సార్లు గెలుపొందితే పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ హాట్ ఫెవరేట్ గా ఉంది.
Also Read : Vijay Interesting Comments : మహిళల భద్రతకు ప్రయారిటీ : విజయ్



















