నటుడు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. తను గతంలో విలక్షణమైన పాత్రలు పోషించాడు. ఒకానొక సమయంలో టాప్ హీరోగా కొనసాగాడు కూడా. అప్పట్లో జెంటిల్మెన్ మూవీ సెన్సేషన్. తను తాజాగా సినిమా మీద ఉన్న కసితో ఏకంగా శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ ను ఏర్పాటు చేశాడు. సినిమాలను తీసే పనిలో పడ్డాడు. తను నటుడు, నిర్మాత, దర్శకుడు కూడా. మంచి అభిరుచి కలిగిన మూవీస్ చేయాలని కోరిక. ఇందులో భాగంగా తాజాగా తన స్వంత కూతురును హీరోయిన్ గా పరిచయం చేస్తూ తీసిన మూవీనే సీతా పయనం. స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడుకున్న ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉంది.
సీతా పయనం మూవీకి అర్జున్ సర్జా దర్శకత్వం వహించాడు. ఇందులో కీలక పాత్రలు పోషించారు సత్య రాజ్ , ప్రకాశ్ రాజ్. ఇక తన కూతురు సరేసరి. తాజాగా సినిమా కు సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అద్భుతంగా వచ్చింది. ఆకట్టుకునేలా ఉంది సీతా పయనం ట్రైలర్. వీనుల విందైన సంగీతం, ఆహ్లాదకరమైన సన్నివేశాలు మనసుని కట్టి పడేయడం ఖాయం. చాన్నాళ్ల తర్వాత అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న సీతా పయనం మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నటుడు, నిర్మాత , దర్శకుడు అర్జున్ సర్జా.
