బండి భ‌గీర‌థ్ కు మ‌రోసారి సిట్ నోటీసులు

పంపించిన సిట్ పోలీస్ అధికారులు

hellotelugu-BanddiBhageeratPocsso

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గ‌రీథ్ పోక్సో కేసు. ఇప్ప‌టికే త‌ను త‌ప్పించుకు తిరుగుతుండ‌డంతో ప‌ట్టుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. దీనికి విచార‌ణ అధికారిగా కూక‌ట్ ప‌ల్లి డీసీపీ రితి రాజ్ గైక్వాడ్ ను నియ‌మించింది. ఆమె త‌న విచార‌ణ‌ను ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే త‌ను విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా బండి భ‌గ‌రీథ్ మేన‌మామ వంశీకృష్ణ‌కు నోటీసులు పంపించింది. విచిత్రం ఏమిటంటే కేంద్ర మంత్రిగా ఉన్న భ‌గీర‌థ్ తండ్రి బండి సంజ‌య్ కు ఇవ్వాల్సింది పోయి మేన‌మామ‌కు ఎలా నోటీసులు ఇస్తారంటూ ప్ర‌శ్నించారు బీఆర్ఎస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఇక పోలీసులు నోటీసులు జారీ చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు బండి నుంచి కానీ ఆయ‌న కొడుకు కానీ స్పందించిన పాపాన పోలేదు. ఇదిలా ఉండ‌గా సిట్ అధికారులు బండి భగీరథ కోసం మరొకసారి నోటీసులు పంపించారు. కరీంనగర్ లో బండిభగీరథ్ మేనమామ వంశీకృష్ణకు ఈ నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ్ కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. భగీరథ కోసం ఢిల్లీకి సైబరాబాద్ ప్రత్యేక బృందం వెళ్లింది. అంతే కాకుండా త‌న కోసం హైదరాబాదులో గాలిస్తున్నాయి రెండు బృందాలు. కాగా తండ్రి బండి సంజయ్, నిన్న కరీంనగర్‌లో ఒక యాత్రలో పాల్గొన్నాడని అతనికి ఎందుకు నోటీసులు ఇవ్వ‌లేదో డీజీపీ సీవీ ఆనంద్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

Exit mobile version