హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వ్యవహారం. మహిళలను, బాలికలను వేధింపులకు గురి చేయడం, కాలేజీలో దాడులకు దిగడం, అడ్డమైన అలవాట్లతో చెలరేగడం పరిపాటిగా మారింది. ఇప్పటికే తనకు సంబంధించిన దారుణమైన వీడియోలు , ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన సంఘటనకు సంబంధించి పోక్సో కేసు నమోదైంది. కానీ బండి భగీరథ్ బయటకు రాలేదు. తను ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదు. చివరకు మహిళలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయినా ఇప్పటి వరకు తన జాడ లేదు.
చివరకు గత్యంతరం లేక రాష్ట్ర సర్కార్ స్పందించింది. సీఎం ఆదేశాల మేరకు సిట్ ను ఏర్పాటు చేశారు. దీనికి అధికారిణిగా కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ను నియమించారు. ఆమె తన విచారణను వేగవంతం చేసింది. పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను విచారించనున్నారు.
కేసు నమోదైన సైబరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ ను వెంట తీసుకుని రావాలని అతని మేనమామ వంశీ కృష్ణ కు నోటీసులు పంపించారు. కరీంనగర్ లో నివసించే వంశీ కృష్ణకు ఈ నోటీసులు ఇచ్చారు.
