Rahul Sipligunj : హైదరాబాద్ – సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణి రెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది హైదరాబాద్ లో. దీనిపై స్పందించారు పెళ్లి కూతురు బాబాయి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వీరి నిశ్చితార్థం ఐటీసీ కోహినూర్ లో ఘనంగా జరిగింది. పెద్దలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందారు. ప్రైవేట్ వేడుకలో హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట ప్రకాశవంతమైన దుస్తులలో అద్భుతంగా కనిపించారు. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) తన వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టారు.
Rahul Sipligunj Engagement
టాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడిగా గుర్తింపు పొందారు రాహుల్ సిప్లిగంజ్ . ఆర్ఆర్ఆర్ మూవీలో పాపులర్ పొందిన నాటు నాటు సాంగ్ ను తను పాడాడు. అంతే కాకుండా సుకుమార్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ , సమంత నటించచిన రంగ రంగ రంగస్థలాన పాట సూపర్ హిట్ గా నిలిచింది. లై మూవీ లో మరో సాంగ్ తనను టాప్ లో నిలిపేలా చేసింది. అంతే కాకుండా బిగ్ బాస్ -3 సెషన్ లో పాల్గొన్నాడు. తను మరింత తెలుగు వారికి దగ్గరయ్యాడు. అత్యంత ప్రజాదరణ పొందిన విజేతగా గుర్తింపు పొందాడు రాహుల్ సిప్లిగంజ్. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం తనకు రూ. కోటి నజరానాగా ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి కావడం, తను రెడ్డి అమ్మాయిని చేసుకోవడం.
Also Read : CP Radhakrishnan Important Meet : ప్రధాని మోదీని కలిసిన సీపీ రాధాకృష్ణన్
