ముంబై : భారతీయ సినీ సంగీత చరిత్రలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన , అద్బుతమైన గాయకుడు అందరినీ విస్తు పోయేలా చేశాడు. ఇకనుంచి తాను పాడలేనంటూ ప్రకటించాడు. ఈమేరకు తాను రిటైర్ అవుతున్నట్లు పేర్కొన్నాడు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా. యావత్ సినీ ప్రపంచం విస్తు పోయింది ఒక్కసారిగా. ఇక నుంచి తాను పాడటం లేదంటూ తెలిపాడు. సంగీత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది నిజం కాక పోయి ఉంటే బాగుండేదన్నారు. అయితే ఎందుకు తప్పుకుంటున్నట్లు అనే విషయం గురించి ఆర్జిత్ సింగ్ వెల్లడించలేదు. తన ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ ప్రఖ్యాత సింగర్ తన ఫ్యాన్స్ తో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. తనకు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.
సింగర్ ఆర్జిత్ సింగ్ ఇలా రాశాడు. హలో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా నాకు ఇంత ప్రేమను అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇకపై నేను ప్లేబ్యాక్ గాయకుడిగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులను తీసుకోబోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నేను దీనిని ముగిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అంటూ మగించాడు ఆర్జిత్ సింగ్. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న శ్రోతలను ఆశ్చర్యపరిచింది. ఈ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పండి, అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అతను లేకుండా బాలీవుడ్ సంగీతం శూన్యంగా ఉందంటూ మరొకరు రాశారు.

















