చెన్నై : మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తాజాగా ప్రకటించిన టి20 జట్టు నుంచి విశ్రాంతి పేరుతో హార్దిక్ పాండ్యాను తొలగించడం పట్ల సీరియస్ అయ్యారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అతనికి విశ్రాంతినిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తే పరిస్థితి ఏంటి? హార్దిక్ పూర్తి స్థాయి ఐపీఎల్ (IPL) ఆడలేదు, పైగా కెప్టెన్సీ , ఫామ్ పరంగా కూడా అతను పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు రాబోయే మూడు T20 సిరీస్‌ల జట్టులో కూడా అతను లేడు.
ఒకవేళ అతన్ని పరీక్షించాలనుకున్నా లేదా గాయం సమస్య ఉన్నా, కనీసం ఒక సిరీస్ తర్వాత అతని స్థానం గురించి నిర్ణయం తీసుకోలేరా అని ప్రశ్నించాడు సెలెక్టర్లను. ఇవి ఏమీ ప్రాముఖ్యత లేని T20 మ్యాచ్‌లు కావు. హార్దిక్ పాండ్యా కేవలం ప్రపంచ కప్ నుంచి ప్రపంచ కప్‌కు మాత్రమే ఆడతాడా? ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్‌ను రెండు నెలల వ్యవధిలోనే పక్కన పెట్టినప్పుడు, 2027 గురించి ఇప్పుడే ప్రణాళికలు వేయడం చాలా దూరం అనిపిస్తుందని పేర్కొన్నాడు. అంతలో ఏమైనా జరగవచ్చు, కాబట్టి 2027 ప్రపంచ కప్ కోసం ఈ మూడు T20 సిరీస్‌లలో హార్దిక్‌ను ఆడించక పోవడం అనేది నాకు అర్థం కాని విషయం అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా సుబ్రమణ్యం భద్రీనాథ్ చేసిన తాజా కామెంట్స్ క్రికెట్ వర్గాలలో ముఖ్యంగా బీసీసీఐ కమిటీలో చర్చకు దారి తీసేలా చేసింది.
