న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరారు డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్. ఈ సందర్బంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరు పొందారు సిద్దరామయ్య. ఇక కొత్త కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. సిద్దరామయ్య పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్ , రణదీప్ సింగ్ నూర్జేవాలాతో కలిసి విస్తృతంగా సమాలోచనలు జరిపారు. కొత్త రాష్ట్ర మంత్రివర్గానికి తుది రూపునిచ్చేందుకు పార్టీ అధిష్టానం, పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో కలిసి సమావేశం అవుతుండటంతో, కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమావేశాల క్రమంలో మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం సాయంత్రం 4:00 గంటలకు లోక్ భవన్‌లో జరగనుంది. శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు, కర్ణాటక తాత్కాలిక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ముందు, ఢిల్లీలోని ఒక హోటల్‌లో విదేశాంగ మంత్రి S. జైశంకర్‌తో సిద్ధరామయ్య సంభాషించడం కనిపించింది. ఖర్గేతో జరగబోయే సమావేశ అజెండా గురించి అడిగినప్పుడు, సిద్ధరామయ్య నాకు తెలియదు అని బదులిచ్చారు. కొత్త ముఖాలకు అవకాశం కల్పించేందుకు, పదవీ విరమణ చేస్తున్న సిద్ధరామయ్య మంత్రివర్గంలోని పలువురు మంత్రులను తొలగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
