Shubman Gill : ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ ల ద్వైపాక్షిక సీరీస్ కోసం కీలక ప్రయోగం చేపట్టింది. ఈ మేరకు సీనియర్ పురుషుల జట్లను వేర్వేరుగా ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా వన్డే జట్టుకు కెప్టెన్ గా ముంబైకి చెందిన శుభ్ మన్ గిల్ (Shubman Gill) ను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. వీరితో పాటు అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వీసీ), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వీసీ), యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేసింది.
BCCI – Shubman Gill
ఇక టి20 జట్టు కోసం సూర్య కుమార్ యాదవ్ ను స్కిప్పర్ గా నియమించింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్ ), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ , వాషింగ్టన్ సుందర్ ను ఖరారు చేసింది. ఇదిలా ఉండగా ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025ను భారత జట్టు దాయాది పాకిస్తాన్ జట్టును ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. తిలక్ వర్మ, శాంసన్, శివమ్ దూఏ సూపర్ షో చేశారు.
Also Read : CM Chandrababu Interesting Comments : పిలిస్తే పలికే అన్నలు ఆటో డ్రైవర్లు : సీఎం
