హైదరాబాద్ : భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచ వ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా చాగంటి ప్రొడక్షన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్ భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు.
హైఎండ్ VFX, అద్భుతమైన కెమెరా వర్క్ సినిమాకు మరింత గ్రాండియర్ తీసుకు వచ్చాయి. ముఖ్యంగా “అమ్మ” పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. శ్రద్ధాదాస్ కొత్త లుక్, మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ‘త్రికాల’ టైటిల్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


















