Elvish Yadav : హర్యానా – బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులకు పాల్పడ్డారు దుండగులు. గురుగ్రామ్‌లోని యూట్యూబర్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున 24 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు ఈ ఘటనలో పాలు పంచుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . CCTV ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎల్విష్ యాదవ్ నివాసం వెలుపల ఈ కాల్పులు కొనసాగాయి. కాగా గురూగ్రామ్ పోలీసులు డజనుకు పైగా రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. కాల్పుల సమయంలో ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేడన్నారు. దీంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డాడని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో సెక్టార్ 57లో జరిగిందని చెప్పారు.
BIgg Boss Winner Elvish Yadav Key Comments
కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎల్విష్ యాదవ్ ప్రస్తుతం హర్యానా వెలుపల ఉన్నాడు. దుండగులు జరిపిన కాల్పులలో యాదవ్ ఇంటి నివాసానికి సంబంధించి అద్దాలు పగిలి పోయాయి. పైకప్పులు ఊడి పోయాయి. యాదవ్ భవనం రెండవ, మూడవ అంతస్తులలో నివసిస్తున్నాడు. సంఘటన సమయంలో అతని సంరక్షకుడు, కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ ఎవరూ గాయ పడలేదు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఫోరెన్సిక్ నమూనాలను సేకరించి, ప్రాంతంలోని సిసిటివి ఫుటేజ్‌లను సమీక్షించడం ప్రారంభించారు. చట్టపరమైన చర్యలు ప్రారంభించ బడుతున్నాయని, కుటుంబం అధికారిక ఫిర్యాదు చేసిన తర్వాత వివరణాత్మక దర్యాప్తు ముందుకు సాగుతుందని అధికారులు తెలిపారు.
Also Read : Next Week IPOs Interesting : వచ్చే వారంలో రానున్న 8 కొత్త ఐపిఓలు ఇవే



















