Short Film : అమరావతి – సృజనాత్మక కళాకారులు, దర్శకులు, ఇన్ఫ్యూయన్సర్స్ కు ఖుష్ కబర్ చెప్పారు సీనియర్ జర్నలిస్ట్ మద్దిలి కేశవరావు. వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ బాల గణపతి ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలింలపై (Short Film) పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎవరైనా పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఉద్దానం ప్రాంతంలోని యువ కళాకారులను ప్రోత్సహించడానికి శ్రీ బాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. సామాజిక అంశాలపై లఘు చిత్రాల పోటీలు (Short Film) నిర్వహించ బోతున్నామని స్పష్టం చేశారు.
Short Film Competation Updates
పోటీలలో పాల్గొనే వారు పూర్తి వివరాలు అందజేయాలని తెలిపారు. షార్ట్ ఫిలిం పూర్తిగా సామాజిక అంశాలపై తీసి ఉండాలని వెల్లడించారు. ప్రతి లఘు చిత్రం గరిష్టంగా 5 నిమిషాలకు మించి ఉండ కూడదని అన్నారు. ప్రధానంగా సామాజిక అంశాలలో ఏదైనా ఒకదానిపై మీ కథనాన్ని రూపొందించాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధం ( పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు), సోషల్ మీడియా ప్రభావం (సామాజిక మాధ్యమాల వల్ల సమాజంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు) , .హెల్మెట్ ధారణ (రోడ్డు భద్రత, హెల్మెట్ ప్రాముఖ్యత), స్పీడ్ డ్రైవింగ్ ( అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు, వాటి నివారణ) పై లేదా మీ ప్రాంతానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సామాజిక అంశంపై షార్ట్ ఫిలిం తీసి ఉండాలని స్పష్టం చేశారు సీనియర్ జర్నలిస్ట్.
తీసిన లఘు చిత్రాన్ని ఈనెల 28వ తేదీ లోగా పంపించాలని, ఎంపికైన మొదటి మూడు చిత్రాలకు ఆకర్షణీయమైన బహుమతులు అంద చేస్తామని పేర్కొన్నారు. మిగతా వివరాలకు ఈ కింద పేర్కొన్న మొబైల్ ఫోన్ 9701655035లో సంప్రదించాలని కోరారు.
Also Read : Minister Savitha – BC Welfare Growth : నగరాల అభివృద్దిపై సర్కార్ ఫోకస్ : సవిత


















