Flax Seeds : హార్మోన్ల అసమతుల్యత, జీర్ణ సమస్యలు, గుండె ఆరోగ్య బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు మహిళలను తరచూ వేధిస్తున్న తరుణంలో, ఇవి నివారించేందుకు సహజ మార్గాల్లో ఒకటిగా అవిసె గింజలు నిలుస్తున్నాయి. పోషకవిలువలతో నిండి ఉండే ఈ గింజలు, మహిళల ఆరోగ్యానికి పెద్ద దోహదం చేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Flax Seeds – హార్మోన్ల సంతులనానికి సహాయపడే గింజలు
వయస్సు పెరిగేకొద్దీ మహిళల్లో హార్మోన్ల మార్పులు సాధారణం. ఇవి క్రమరహిత పీరియడ్స్, మూడ్ స్వింగ్స్, అలసట వంటి సమస్యలకు దారితీస్తాయి. అవిసె గింజల్లో (Flax Seeds) ఉండే లిగ్నాన్ అనే సహజ సమ్మేళనం, శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఋతుచక్రం స్థిరంగా ఉండే అవకాశం పెరుగుతుంది.
గుండె ఆరోగ్యానికి అవిసె గింజలు
చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో అవిసె గింజలు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు ఫైబర్, గుండెకు రక్షణ కల్పించడమే కాకుండా, రక్తనాళాల లోపలికి మంచి రక్త ప్రసరణకు దోహదం చేస్తాయి.
జీర్ణవ్యవస్థకు సహజ సహాయకుడు
ఋతుచక్రాల సమయంలో మారే హార్మోన్ల ప్రభావం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావడం సహజం. ఈ సమయంలో అవిసె గింజల్లో ఉండే కరిగే, కరగని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించేందుకు ఇది సహజమైన పరిష్కారంగా భావించవచ్చు.
ప్రతిరోజూ ఒక స్పూన్ చాలుపోతోంది!
నిపుణుల సూచనల ప్రకారం, రోజువారీ ఆహారంలో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. గింజలను పొడి చేసి పాలు, సలాడ్లు లేదా చపాతీలో కలిపి తీసుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య సంబంధిత మార్పులకు ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కల్పించే ఉద్దేశంతో మాత్రమే.
Also Read : Milk with Turmeric Interesting : పాలలో పసుపు కలిపి తాగితే ఆరోగ్య సమస్యలు రావా?



















